తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన ఏఐజీ ఆసుపత్రి

  • రానున్న 48 గంటలు ముఖ్యమని... వివిధ విభాగాల వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడి
  • బీపీ లెవల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్‌కు చేరుకున్నట్లు వెల్లడి
  • లంగ్స్‌లో ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు తెలిపిన వైద్యులు
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి బుధవారం విడుదల చేసింది. వివిధ విభాగాల వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారని, రానున్న 48 గంటలు ముఖ్యమని బులెటిన్‌లో తెలిపింది. తమ్మినేని బీపీ కంట్రోల్‌లో ఉందని... ప్రస్తుతం ఆయన మాట్లాడగలుగుతున్నారని పేర్కొంది. బీపీ లెవల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్‌కు చేరుకున్నట్లు తెలిపింది. లంగ్స్‌లో ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

ఐసీయూలో వెంటిలెటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టు, అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఖమ్మం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Tammineni
Telangana
Congress

More Telugu News